సరోగసీ పద్ధతిలో బిడ్డను కనేందుకు సిద్దమైన నయనతార?

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార చాలా కాలంగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో రిలేషన్ లో ఉంది. ఈ జంటకు పెళ్లైపోయిందని ఈ మధ్య ప్రచారం జరిగింది కానీ ఆ విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు. ఇటీవల విఘ్నేష్ శివన్, నయనతార కలిసి చెన్నైలో ఓ గుడిలో పూజ చేయించుకున్నారు. ఆ గుడి నుంచి బయటకు వస్తోన్న సమయంలో నయనతార నుదిటి మీద కుంకుమ ఉంది. పెళ్లైన స్త్రీలు నుదిటి సింధూరం పెట్టుకున్నట్లుగా నయన్ కూడా పెట్టుకోవడంతో ఈ జంటకి పెళ్లైపోయిందని అంటున్నారు. అయితే విఘ్నేష్ తో ఎంగేజ్మెంట్ అయింది అని గత ఏడాది నయన్ వెల్లడించింది. సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారని అంటున్నా దాని మీద ఎలాంటి క్లారిటీ లేదు. .అయితే ఇప్పుడు ఏకంగా ఈ జంట సరోగసీ ద్వారా బిడ్డను కనడానికి ఫిక్స్ అయినట్లు ప్రచారం మొదలయింది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు సరోగసీ పద్ధతి ద్వారా బిడ్డలను పొందారు. ప్రియాంక చోప్రా, శిల్పా శెట్టి, లాంటి చాలా మంది ఆ లిస్టులో ఉన్నారు. ఇప్పుడు నయనతార కూడా అదే లిస్టులో జాయిన్ అవబోతోంది అని తెలుస్తోంది. ఈ విషయంలో ఎంతవరకు నిజముందనేది మాత్రం తెలియదు కానీ తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది.