షాకింగ్: వ్యభిచారం కేసులో తెలుగు సీరియల్ నటి అరెస్టు

సినిమా.. ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ అవకాశాలు కోసం వచ్చినవారిలో చాలా తక్కువమంది స్టార్స్ గా మారతారు..మిగతా వాళ్ళు సినిమాల్లో నిలబడాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారే లక్ష్యంగా కొన్ని ముఠాలు వారిని వ్యభిచారంలోకి దించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అలా ఒక టీవీ నటి అనుకోకుండా వ్యభిచార కూపంలోకి దిగిపోయి అనూహ్య పరిస్థితుల్లో పోలీసులు చేతికి చిక్కింది. తాజాగా గోవాలో ఒక వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. పనాజీ సమీపంలోని సంగోల్డా గ్రామంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన చెందిన హఫీజ్ సయ్యద్ బిలాల్ అనే వ్యక్తి వ్యభిచార దందా నడుపుతున్నాడని, హైదరాబాద్ నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచార కూపంలోకి దింపుతున్నాడని పక్కా సమాచారం రావడంతో గోవా పోలీసులు అతడు ఉంటున్న హోటల్ మీద రైడ్ చేశారు. ఈ రైడ్ లో ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు. ముగ్గురు మహిళల్లో ఒకరు తెలుగు టీవీ సీరియల్ నటి కావడం గమనార్హం. తెలుగు సీరియల్స్ లో కనిపించే ఆమె వ్యభిచారం చేస్తూ దొరకడం ప్రస్తుతం తెలుగు స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె వయస్సు 34 ఏళ్లు అని తెలుస్తోంది కానీ ఆమెకు సంబంధించిన మరే ఇతర వివరాలు కూడా పోలీసులు బయటకు వెల్లడించడం లేదు. ఆమె వివరాలు బయటకు రాకుండా చూసుకోవాలని హైదరాబాద్ నుంచి పనాజీ పోలీసులకు ఫోన్ లు వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె గత మూడు రోజులుగా గోవాలోని అదే హోటల్లో బస చేసిందని తెలుస్తోంది.