ఆర్ఆర్ఆర్ కి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో రూపొందిన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లు. అజయ్​ దేవగన్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించిన ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు రెండు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణలో రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించుకునేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించింది. ఎంతమేర పెంచుకోవచ్చనే విషయం మీద ప్రకటన కూడా జారీ చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. సినిమా విడుదలైన తర్వాత మూడు రోజుల వరకు ఏసీ థియేటర్లలో టికెట్​పై రూ.50 అధికంగా వసూలు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏడు రోజుల వరకు రూ.30 చొప్పున పెంచి అమ్ముకోవచ్చు. నాన్ ఏసీ థియేటర్ల విషయంలో రేట్ల పెంపు అవకాశం లేదని సర్కారు స్పష్టం చేసింది. అయితే మల్టీ ప్లెక్స్ లలో మొదటి మూడు రోజులు 100 రూపాయలు ఆ తరువాత వరం రోజులు 50 రూపాయలు పెంచుకునే అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 నుంచి రాత్రి ఒంటి గంట మధ్య థియేటర్లలో ఐదు ఆటలు ప్రదర్శించుకునే అవకాశం కూడా కల్పించింది. ఏపీలో కూడా ఈ సినిమాకు రేట్ల పెంపునకు అనుమతించింది. అన్ని రకాల టికెట్లపై అదనంగా రూ.75 మేర వసూలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. సినిమా విడుదల తేదీ నుంచి 10 రోజుల పాటు పెంచిన ధరలు వర్తిస్తాయని హోమ్ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.