లక్కీ ఛాన్స్ కొట్టేసిన కృతి శెట్టి

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్‌లో అత్యంత బిజీ నటీమణులలో ఒకరిగా మారిపోయింది. ఆమె చేతిలో ఇప్పుడు అర డజను సినిమాలు ఉన్నాయి. అయితే తాజాగా ఆమె లక్కీ ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా ప్రధాన పాత్రలో నటించబోయే సినిమాలో సాయి తేజ్ పక్కన నటించేందుకు కృతి శెట్టిని సంప్రదించారని అంటున్నారు. కృతి శెట్టి డేట్స్ ఖరారు చేయడానికి సిద్ధమైందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం రెండు షెడ్యూల్స్‌లో 40 రోజుల్లో పూర్తి చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆసక్తికరమైన కాంబో మూవీకి సముద్రకని దర్శకత్వం వహించనున్నారు. ఇది తమిళ చిత్రం వినోదయ సీతమ్‌కి రీమేక్. తమిళంలో కూడా ఈ సినిమాను ఆయనే తెరకెక్కించారు. ఆ సినిమాలో తాను నటించిన పాత్రలో ఈ సినిమాలో పవన్ ను నటింపచేసేలా సముద్రకని ఒప్పించారు. ఏప్రిల్‌లో సినిమాను ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నారు. జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా ఏప్రిల్‌లో హరిహర వీర మల్లు షూటింగ్‌ని పునఃప్రారంభించనున్నారు. ఈ ఏడాది దసరా సందర్భంగా ఆ సినిమాను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.