యాంకర్లుగా మారుతున్న స్టార్ డైరెక్టర్లు

తెలుగు సినిమా పరిధి దాటుతోంది. తెలుగులో ఎలాంటి సినిమాలు విడుదలవుతున్నాయి అనే విషయం మీద కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు నార్త్ సహా తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వారంతా కూడా తెలుగు సినిమాలను మాత్రమే కాదు సెలబ్రిటీలలను కూడా బాగా ఫాలో అవుతున్నారు. తెలుగు సినిమాలు కూడా వీలైనన్ని ఎక్కువ భాషల్లో విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.. అలా ప్లాన్ చేస్తున్న సమయంలోనే కొందరు దర్శకులు యాంకర్లుగా కూడా అవతారం ఎత్తవలసి వస్తోంది. మీరు గమనించనట్టు అయితే తాజాగా విడుదలైన ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్స్ కోసం రాజమౌళి యాంకర్ అవతారం ఎత్తగా ఇప్పుడు ప్రతిష్టాత్మక ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ కోసం అనిల్ రావిపూడి యాంకర్ అవతారం ఎత్తారు. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే అలా చేయడం వల్ల సినిమా మీద మరింత ఆసక్తి కలిగించే ప్రయత్నం చేస్తున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.. ఇప్పుడు సినీ పరిశ్రమలో ఎవరూ ఏ ఒక్క పనికి పరిమితం కావడం లేదు. గతంలో ప్రభాస్ కూడా పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ ఆకాష్ పూరి రొమాంటిక్ విడుదల సమయంలో తాను యాంకర్ అవతారం ఎత్తి హీరో హీరోయిన్లను ఇంటర్వ్యూ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఇలా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ మన పని కాదులే అని కూర్చోకుండా ప్రేక్షకులకు తాము దగ్గరవుతూ తమ సన్నిహితులకు సంబంధించిన సినిమాలను కూడా దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరకంగా ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం అనే చెప్పాలి.