గాలి జనార్దన్ రెడ్డి కుమారుడి సినీ ఎంట్రీకి రంగం సిద్ధం

సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇక తెలుగు, తమిళ రాజకీయాల్లో సినిమాల ప్రభావం, సినిమా వారి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అదే కోవలో అయితే కన్నడ రాజకీయాల్లో చక్రం తిప్పిన గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి త్వరలోనే వెండితెరపై అరంగేట్రం చేయనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. త్వరలో కిరీటి మొదటి సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 4న బెంగ‌ళూరులో అట్ట‌హాసంగా గాలి కిరీటి చిత్రం గ్రాండ్‌గా ప్రారంభం కానుంద‌ని సమాచారం. తెలుగుతో పాటు క‌న్న‌డలోనూ ఒకేసారి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నట్టు చెబుతున్నారు. కన్నడ డైరెక్టర్​ రాధాకృష్ణ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం చేయనున్నట్లు సమాచారం. ఆయన కన్నడలో ‘మాయాబజార్’ అనే మూవీ తెరకెక్కించాడు. టాలీవుడ్‌లో ప్ర‌ముఖ నిర్మాత‌గా ఎదిగిన సాయి కొర్ర‌పాటి త‌న వారాహి సంస్థ ద్వారా గాలి కిరీటిని హీరోగా ప‌రిచయం చేస్తున్నార‌ట‌. ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి స్వ‌రాలు స‌మ‌కూరుస్తారని తెలుస్తోంది. బాహుబ‌లి చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరామన్‌గా ప‌నిచేస్తార‌ని అంటున్నారు.