‘ధూత’గా నాగచైతన్య

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ అందుకున్న ఆయన ప్రస్తుతం విక్రమ్​ కె కుమార్​ దర్శకత్వం వహిస్తున్న ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. మరోపక్క నాగ చైతన్య ఒక హార్రర్​ వెబ్​ సిరీస్ కూడా ఒప్పుకున్నారు. అమెజాన్​ ప్రైమ్​ ఒరిజినల్స్ లో భాగంగా నిర్మిస్తున్న ఈ వెబ్​ సిరీస్​కు విక్రమ్ కె కుమార్​ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్​ సిరీస్​కు ‘దూత’ అనే టైటిల్​ను ఫిక్స్​ చేసినట్లు సమాచారం. ఈ సిరీస్​ చిత్రీకరణ చాలా రోజుల నుంచి జరుగుతోండగా మంగళవారం నుంచి నాగచైతన్య కూడా షూట్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా నాగ చైతన్య ఒక పోస్ట్​ షేర్​ చేశారు. ఈ పోస్ట్​లో బ్లాక్​ అండ్​ వైట్​లో చైతూ వెనుక ఉన్న స్క్రిప్ట్​ను చూపిస్తూ ‘దూత.. ఎపిసోడ్​ 1’ అని తెలిపారు. ఈ లుక్​లో నాగ చైతన్య కొత్తగా కనిపిస్తున్నారు.