విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక ఏమందంటే?

టాలీవుడ్ క్రేజీ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన డేటింగ్ లో ఉన్నారని వార్తలు పుట్టుకు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయం మీద వారు ఎన్ని సార్లు ఖండిస్తున్నా వార్తలు మాత్రం ఆగడం లేదు. ఈ మధ్య కూడా ఈ వార్తల మీద బాలీవుడ్ మీడియా సైతం ఈ అంశానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై విజయ్ దేవరకొండ పరోక్షంగా స్పందించాడు. అయితే తాజాగా రష్మిక కూడా ఈ అంశంపై స్పందించింది. ఆడవాళ్ళూ మీకు జోహార్లు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ, ఆ వార్తలు తన దృష్టికి కూడా వచ్చాయని, ఇలాంటి పుకార్లు నాకు కొత్తేమి కాదని తెలిపింది. ఇలాంటి వార్తలు విని నవ్వుకోవడం అలవాటయింది అని ఆమె చెప్పుకొచ్చింది. ఆ పుకార్లు పట్టించుకునే సమయం కూడా తనకు లేదని తెలిపింది.