రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న అర్చన

ఇటీవల కాలంలో టాలీవుడ్ లో సీనియర్ నటీమణులు రీ ఎంట్రీ ఇస్తున్నారు. రీ ఎంట్రీ ఇవ్వడమే కాక వారి సెకండ్ ఇన్నింగ్స్ దిగ్విజయంగా సాగుతున్నాయి. ఇప్పుడు మరో తార రీ ఎంట్రీకి సిద్ధమయ్యారు. గతంలో నిరీక్షణ, లేడీస్ టైలర్ వంటి సినిమాలలో నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నటి అర్చన ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నారు. గ్లామర్ కంటే అభినయానికే అధిక ప్రాధాన్యత ఇచ్చి అవార్డుల నటిగా పేరు తెచ్చుకున్న అర్చన మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారు. పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటిస్తున్న చోర్ బజార్ చిత్రం ద్వారా అర్చన తెలుగు చిత్రసీమలో సెకండ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. దళం, జార్జి రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.