“రాధేశ్యామ్” నుంచి “ఈ రాతలే” సాంగ్ విడుదల

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్” ప్రమోషన్స్ మళ్ళీ స్టార్ట్ చేశారు. మార్చి 11న సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా నుంచి “ఈ రాతలే ” అనే రొమాంటిక్ వీడియో సాంగ్ ను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ పాటను విడుదల చేశారు మేకర్స్. తెలుగు వెర్షన్ పాటను యువన్ శంకర్ రాజా, హరిణి ఇవటూరి పాడారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, జస్టిన్ ప్రభాకరన్ ట్యూన్ శ్రావ్యంగా ఉంది. ఈ ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఒకరినొకరు ఎలా కలుసుకున్నారు? విధి వారిని ఎలా కలిపింది ? అనే విషయాన్ని ఈ సాంగ్ లో చూపించారు. టి సిరీస్, గోపీకృష్ణ మూవీస్‌, UV క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. “రాధే శ్యామ్” ఇటలీ నేపథ్యంలో సాగే పీరియాడికల్ లవ్ డ్రామా. ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, సత్యన్, ప్రియదర్శి, మురళీ శర్మ, సాషా చెత్రీ మరియు రిద్ధి కుమార్ కూడా ఉన్నారు. రాధాకృష్ణ కుమార్ “రాధేశ్యామ్”కు సంగీతం అందించారు.