“ఆడవాళ్లు మీకు జోహార్లు” ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్టులు ఎవరెవరో తెలుసా ?

యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఆడవాళ్లు మీకు జోహార్లు”. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో ఖుష్బు, రాధికా శరత్‌కుమార్, ఊర్వశి కూడా సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. “ఆడవాళ్లు మీకు జోహార్లు” చిత్రాన్ని మార్చి 4న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముహుర్తాన్ని ఖరారు చేశారు. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న చిత్రబృందం ఫిబ్రవరి 27న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా స్టార్ హీరోయిన్లు సాయి పల్లవి, కీర్తి సురేష్ తో పాటు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా హాజరు కానున్నారు.