
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవంతం అయ్యింది. అయితే ఈవెంట్ మొత్తంలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీచ్ లేకపోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అసలు ఆయన ఫంక్షన్‌కి వచ్చారా లేదా అన్న సందేహం కూడా ఫ్యాన్స్‌లో మిగిలిపోయింది. పవన్ సినిమా ఫంక్షన్‌కు అన్నీ తానై ముందుండి నడిపించే త్రివిక్రమ్ ఈ సినిమా విషయంలో మాత్రం బ్యాక్ స్టేజ్‌కే ఎందుకు పరిమితం అయ్యారన్నది ఇప్పడు చర్చనీయాంశమైంది. దీనికి ఓ కారణం ఉందట. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి త్రివిక్రమ్ పేరే హైలైట్ అవుతూ వచ్చింది. నిజానికి యంగ్ ఫిల్మ్ మేకర్ సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కానీ సోషల్ మీడియాలోనూ త్రివిక్రమ్ పేరు ఎక్కువగా వినిపిస్తుండటంతో ఈవెంట్లో అయినా సాగర్ చంద్ర హైలెట్ అవ్వాలని భావించి తాను ఎలాంటి హడావిడి లేకుండా కావాలనే త్రివిక్రమ్ బ్యాక్ స్టేజ్‌కి పరిమితం అయ్యారని అంటున్నారు.