
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘భీమ్లానాయక్’ శుక్రవారం రిలీజ్ కానున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో భీమ్లానాయక్ చిత్రానికి ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. తక్కువ రేటుకు టికెట్లు అమ్మాలని అధికారులు ఆదేశాలు జారీ చేయటం పవన్ అభిమానుల్లో ఆగ్రహం తెప్పించింది. అన్ని సినిమాలకు లేని ఆంక్షలు పవన్ చిత్రానికే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు నిరసనగా.. గుంటూరు జిల్లా మాచర్లలోని నాగార్జున కళామందిర్ థియేటర్ వద్ద అభిమానులు వినూత్నంగా నిరసన తెలిపారు. తమ అభిమాన నటుడి సినిమా వల్ల థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదని అభిమానులు హుండీ ఏర్పాటు చేశారు. హుండీ ద్వారా వచ్చే విరాళాలు వారికి అందజేయనున్నట్టు చెప్పారు.