సర్జరీలకు సమయం ఆసన్నమైంది: హంసా నందిని

https://www.instagram.com/p/CaWPQw7tFp8/?utm_source=ig_embed&ig_rid=865aa8b6-a067-4c98-9711-922abc39700c

టాలీవుడ్‌ నటి హంసా నందిని ఇటీవలే క్యాన్సర్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా తన పరిస్థితిపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోస్ట్‌ను షేర్‌ చేసింది హంసా . ‘16 సైకిల్స్‌ కీమో థెరపీ పూర్తయింది. ఇప్పుడు నేను అధికారికంగా కీమో నుంచి కోలుకున్నాను. కానీ చికిత్స ఇంకా పూర్తి కాలేదు. నేను ఇంకా గెలవలేదు. తదుపరి పోరాటానికి నేను సన్నద్దం కావాల్సిన తరుణం ఇది. సర్జరీలకు సమయం ఆసన్నమైంది’ అంటూ చేతిలో సెలైన్ బాటిల్ పట్టుకున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ఇది చూసిన నెటిజన్లు మీరు మరింత బలంగా తిరిగొస్తారు. గెట్‌ వెల్‌ సూన్‌ అంటూ పేర్కొన్నారు. ఆర్యన్‌ రాజేశ్‌ హీరోగా వచ్చిన ‘అనుమానస్పదం’ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైన హంసానందిని.. ‘మిర్చి, అత్తారింటికి దారేది’ చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్స్‌తో గుర్తింపు పొందింది. కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది.