“భీమ్లా నాయక్” ఎన్ని థియేటర్లలో విడుదల అవుతుందో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “భీమ్లా నాయక్”. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు డైలాగ్స్ రాయగా, సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు. నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ‘భీమ్లా నాయక్’ ప్రపంచవ్యాప్తంగా 1875 కు పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. నిజాంలో 375, సీడెడ్ లో 250, ఏపీ, తెలంగాణలో – 1075+, కర్ణాటక సహా మిగతా భారత్ లో 200+, అలాగే ఓవర్సీస్ లో – 600 థియేటర్లలో విడుదల కానుంది.