
డైరెక్టర్ తేజ ప్రస్తుతం రానా సోదరుడు అభిరాం దగ్గుబాటి హీరోగా అహింస మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అభిరాం హీరోగా పరిచయం కానున్నారు. భిన్న కథలతో కొత్త హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసే తేజ ఇప్పుడు ఆయన తనయుడిని హీరోగా చూపించబోతున్నారు. ఫిబ్రవరి 22 తేజ బర్త్‌డే సందర్భంగా ఆయన కొత్త సినిమాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన పిరియాడికల్ ఎపిక్ లవ్‌స్టోరిగా విక్రమాదిత్య మూవీని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. లక్ష్మి నరసింహా ప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆయన బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. 18వ శతాబ్దం నేపథ్యంలో నడిచే ప్రేమకథ ఇది. ఈ మూవీలో తేజ కొడుకు అమితవ్ లీడ్ రోల్ పోషిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ‘విక్రమాదిత్య’ అనే పిరియాడికల్ లవ్‌స్టోరితో తేజ తన కుమారుడిని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారట. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజుల ఆగాల్సిందే. కాగా త్వరలోనే ‘విక్రమాదిత్య’ను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.