నేచురల్ స్టార్ నానికి శుభాకాంక్షల వెల్లువ

2 13

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నాని తన అద్భుతమైన నటనతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నేచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నాని ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటించగలరు. నాని 2005లో క్లాప్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో తన కెరీర్‌ను ప్రారంభించారు. అదే సమయంలో రేడియో జాకీగా పని చేశారు. 2008లో నాని రొమాంటిక్ కామెడీ ‘అష్టా చమ్మా’తో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత వైవిధ్యమైన పలు కమర్షియల్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఈ నాని ‘అంటే సుందరానికి’, ‘దసరా’ వంటి పలు చిత్రాలతో బిజీగా ఉన్న నాని గురువారం తన 38వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, స్నేహితుల నుంచి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కొంతమంది నిర్మాతలు గ్రూప్‌గా కలిసి వెళ్లి నానికి బర్త్ డే విషెస్ తెలియజేశారు.