‘భీమ్లానాయక్’పై బండ్ల ట్వీట్

3 11

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషనల్ రూపొందిన చిత్రం ‘భీమ్లానాయక్’. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌కు వీర భక్తుడు అయిన నిర్మాత, నటుడు బండ్ల గణేష్ గురువారం రాత్రి ట్వీట్ చేశారు. ‘‘మా దేవర నటించిన భీమ్లా నాయక్ దెబ్బకి బాక్సులు బద్దలవ్వాలని రికార్డులు చిరిగిపోవాలని దిక్కులు పిక్కటిల్లేలా అభిమానులు స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ … చరిత్ర కోసం మీరు కాదు. మీ కోసం చరిత్ర దేవర’’ అంటూ బండ్ల గణేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై పవన్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే భీమ్లానాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు బండ్ల గణేష్ రాకపోవడంతో ‘వియ్ మిస్ యూ బండ్లన్న’ అంటూ ట్వీట్ చేస్తున్నారు.