అక్కినేని మల్టీస్టారర్ కోసం రంగం సిద్ధం?

సంక్రాంతికి అక్కినేని మల్టీస్టారర్ “బంగార్రాజు” వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో అక్కినేని కాంబో రాబోతుంది. మోహన్ రాజా దర్శకత్వంలో నాగార్జున, అఖిల్ కలిసి ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ అక్కినేని హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్‌పై తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ అక్కినేని హీరోల కాంబోలో వస్తున్న మూడవ మల్టీస్టారర్ అవుతుంది. గతంలో మనం, బంగార్రాజు చిత్రాల్లో అక్కినేని హీరోలు అలరించిన విషయం తెలిసిందే. తండ్రీకొడుకులు గతంలో అఖిల్ తొలి చిత్రం ‘అఖిల్’లో ఒక పాట కోసం కలిసి తెరపై కనిపించారు. ‘మనం’ చివర్లో చిన్న చిన్న పాత్ర కూడా చేశారు. నాగార్జునతో అఖిల్ పూర్తి స్థాయి సినిమా కోసం స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ సినిమాతో బిజీగా ఉన్నాడు.