
నాలుగు భారీ పోస్టర్లను విడుదల చేయడం ద్వారా పృథ్వీరాజ్ చిత్ర విడుదల తేదీని వైఆర్ఎఫ్ (యశ్‌రాజ్ ఫిల్మ్స్) ప్రకటించింది ! అక్షయ్‌కుమార్, మానుషీ చిల్లర్ ముఖ్య తారాగాణంగా నటించిన ఈ చిత్రం ఈ సంవత్సరం జూన్ 10వ తేదీన హిందీ, తమిళం మరియు తెలుగు భాషలతో పాటుగా ఐమ్యాక్స్‌లో కూడా విడుదల కానుంది ! ఈ చిత్రంలో సోనూసూద్, సంజయ్ దత్ కూడా నటించారు. ఈ చిత్ర దర్శకుడు డాక్టర్ చంద్ర ప్రకాష్ ద్వివేది.