హీరో అర్జున్ ఇంట విషాదం

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. యాక్షన్ కింగ్ అర్జున్ మామయ్య, ప్రముఖ కన్నడ నటుడు రాజేష్ అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. 99 సంవత్సరాలు ఉన్న అర్జున్ మామ రాజేష్… గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఆయన జాయిన్ అయ్యారు. అయితే తాజాగా రాజేష్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు సమాచారం. రాజేష్ తన కెరీర్ లో దాదాపు 150 సినిమాల్లో నటించారు. అలాగే ఆయన ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. ఆయన మృతి పట్ల తమిళ, కన్నడ సినీ ప్రముఖుల సంతాపం తెలుపుతున్నారు.