మెగాస్టార్ విషెస్.. సీఎంవో థ్యాంక్స్

8 6

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గురువారం సోషల్ మీడియాలో ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. గౌరవ ముఖ్యమంత్రికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కే సి ఆర్ గారికి హార్దిక జన్మ దిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో  వుండాలని, మీ లక్ష్యసాధనకి, ప్రజాసేవకి మీకు ఆ భగవంతుడు అపరిమిత శక్తి సామర్ధ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’’ అని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు తెలంగాణ సీఎంవో రిప్లయ్ ఇచ్చింది. ‘శ్రీ చిరంజీవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక ట్విట్టర్ ఖాతా పేర్కొంది.