
హైదరాబాద్లోని ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం “డస్టర్ 1212”. శుభకరి క్రియేషన్స్, వి.యస్.ఆర్ మూవీస్ బ్యానర్స్ పై అథర్వా(వాల్మికీ ఫేమ్), మిష్టి, అనైకాసోటి నటీనటులుగా బద్రీ వెంకటేష్ దర్శకత్వంలో మరిపి విద్యాసాగర్(వినయ్), విసినిగిరి శ్రీనివాస రావులు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్, నిర్మాత యమ్. సూర్య నారాయణ రెడ్డి, దర్శకుడు శ్రీకాంత్, నటుడు కాదంబరి కిరణ్ తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో అతిథులు మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగుందని, ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.