‘పుష్ప’ పాటలకు క్రికెటర్‌ భార్య స్టెప్పులు

అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ మూవీ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఓ క్రికెటర్ భార్య కూడా పుష్ప మూవీ పాటలకు స్టెప్పులేశారు. ఎన్నో డ్యాన్స్‌ వీడియోలతో సోషల్‌ మీడియా వేదికగా అలరించిన టీమిండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ సతీమణి ధనశ్రీ వర్మ మరోసారి తన ప్రతిభ చూపింది. అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమాలోని పవర్‌ఫుల్‌ సాంగ్‌ ‘ఏయ్‌ బిడ్డా’, ఐటెమ్‌ సాంగ్‌ ‘ఊ అంటావా’కు తనదైన శైలిలో స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ‘‘గత నెలలో ఈ రెండు పాటలు ఎంతో ఫేమస్‌ అయ్యాయి’’ అని పేర్కొంది. తనకు డ్రామా కంటే డ్యాన్స్‌ అంటేనే ఇష్టమని చెప్పుకొచ్చింది. పోస్ట్‌ చేసిన తక్కువ సమయంలో అత్యధిక మంది ఈ వీడియోను వీక్షించారు. బీట్‌, సాహిత్యానికి తగ్గట్టు ధనశ్రీ పలికించిన హావభావాలకు నెటిజన్లతోపాటు పలువురు సినీ, క్రీడా తారలు ఫిదా అవుతున్నారు.

https://www.instagram.com/reel/CaB4r06po8h/?utm_source=ig_embed&ig_rid=6d80272a-e197-4fb6-8ff0-593d2345f286