”వర్జిన్ స్టోరీ” సినిమా నుంచి కొత్తగా రెక్కలొచ్చెనా సాంగ్ విడుదల

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా వర్జిన్ స్టోరీ. గతంలో రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్న విక్రమ్ తాజాగా దిల్ రాజు నిర్మించిన రౌడీ బాయ్స్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించారు. రౌడీ బాయ్స్ లో విక్రమ్ చేసిన క్యారెక్టర్ కు, ఫర్మార్మెన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు విక్రమ్ వర్జిన్ స్టోరి సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. కొత్తగా రెక్కలొచ్చెనా..అనేది ఈ సినిమా క్యాప్షన్. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్ మీద లగడపాటి శిరీష శ్రీధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రదీప్ బి అట్లూరి వర్జిన్ స్టోరి చిత్రంతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 3 వ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు ఫిల్మ్ యూనిట్. సోషల్ మీడియా ద్వారా పాటను డైరెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కొత్తగా రెక్కలొచ్చెనా అంటూ సాగుతున్న ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి రెండో వారంలో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి సంగీతం అచు రాజమణి అందిస్తుండగా భాస్కర భట్ల, అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు.