విడాకుల ప్ర‌క‌ట‌న‌ను డిలీట్ చేసిన స‌మంత‌

ఏడాది వారిద్ద‌రూ సామాజిక మాధ్య‌మాల ద్వారా ప్ర‌క‌ట‌న‌ చేశారు. ఆ త‌ర్వాత ఎవ‌రి సినిమా షూటింగుల్లో వారు బిజీగా ఉంటున్నా ఆ విషయం ఇప్పటికీ ఎదో ఒకరకంగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే, ఆ ప్ర‌క‌ట‌న‌కు సంబంధించిన పోస్టును తాజాగా స‌మంత ఇప్పుడు డిలీట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆమె డిలీట్ చేయడంతో అనేక సందేహాలు వ్య‌క్తం చేస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. స‌మంత‌, నాగ చైత‌న్య‌ మళ్లీ కలిసిపోతున్నారా? అని కొంత మంది అంటుంటే నాగ చైత‌న్య మాత్రం ఆ పోస్టును డిలీట్ చేయ‌లేదు కాబట్టి అది నిజం కాదని అంటున్నారు. ఆ ప్ర‌క‌ట‌న‌ చేసి చాలా రోజులు అవుతున్న నేప‌థ్యంలో ఇక ఆ పోస్టు అవసరం లేద‌ని భావించి స‌మంత దాన్ని డిలీట్ చేసి ఉండొచ్చ‌ని కొందరు అంటున్నారు. మొత్తం మీద సమంత ఏం చేసినా అది చర్చనీయాంశం అవుతూనే ఉంది.