బాలకృష్ణను కలవాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి!

నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులకు గొప్ప అవకాశం కల్పించింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. బాలయ్యను కలవాలని ఆయన అభిమానులు కలలు కంటూ ఉంటారు. వాళ్లకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మంచి ఆఫర్ ఒకటి ఇచ్చింది. ‘అఖండ’ సినిమా ఈ ఓటీటీ వేదికగా శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు విడుదల అయిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు… సినిమా చూసిన వారిలో 500 మందికి బాలకృష్ణను కలిసే అదృష్టం దక్కనుంది. సినిమా చూసిన వారు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ… డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ తెలుగు ఐడీని ట్యాగ్ చేయాలి. “ఐదు వందల మంది లక్కీ విన్న‌ర్స్‌నుబాలకృష్ణ కలవనున్నారు. ఇక గురువారం హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లో సినిమా అర్థ శతదినోత్సవ వేడుక నిర్వహించారు.