నాగశౌర్య బర్త్ డే స్పెషల్

నాగశౌర్య 1989 జనవరి 22న ఏలూరులో జన్మించి, విజయవాడలో పెరిగారు. సినిమాల్లో నటించాలనే ఆసక్తితో అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ఇండస్ట్రీలోకి రావడానికి ముందు టెన్నిస్ క్రీడలో ప్రావీణ్యం సాధించారు. సినిమాల్లోకి రావడం కోసం దాదాపు 5ఏళ్ల పాటు శ్రమించారు. ఓ సారి వారాహి చలన చిత్రం నిర్మాణ సంస్థ వారు ఇచ్చిన ప్రకటన చూసి తన ఫొటోలను పంపించారు. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో రూపొందుతున్న ఆ రొమాంటిక్ కామెడీ మూవీ ఊహలుగుసగులాడే కోసం లీడ్ రోల్‌కు సెలెక్ట్ అయ్యారు శౌర్య. ఆ సినిమాకు పనిచేస్తుండగానే ‘చందమామ కథలు’ అవకాశం కూడా వచ్చింది. ఆంథోలాజీ ఫిల్మ్‌గా రూపొందిన ఆ చిత్రమే నాగశౌర్య ఫస్ట్ ఫిల్మ్‌‌గా రిలీజ్ అయింది. అందులో శౌర్య స్క్రీన్ ప్రెజెన్స్ 20 నిమిషాలే అయినా నటనతో ఆకట్టుకున్నారు. ఆ చిత్రం తర్వాత రెండు నెలలకే విడుదలైన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం నాగశౌర్యకు కమర్షియల్ సక్సెస్ అందించింది. ఆ చిత్రంతో శౌర్య హీరోగా నిలబడ్డారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ‘కల్యాణ వైభోగమే’ ‘దిక్కులు చూడకు రామయ్యా’ ‘జ్యో అచ్యుతానంద’ ‘ఒక మనసు’ చిత్రాలు శౌర్యకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక ‘ఛలో’ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న శౌర్య.. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్న శౌర్య.. ‘వరుడు కావలెను’ చిత్రంతో గత ఏడాది డీసెంట్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత లక్ష్య సినిమాలో తన శరీర సౌష్టవాన్ని ప్రదర్శించి ఆరు పలకల దేహంతో ఆకట్టుకున్నారు.

ప్రస్తుతం ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి, నారినారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక చిత్రంతో పాటు పేరు పెట్టని మరో సినిమా కూడా చేస్తున్నారు నాగశౌర్య. ఈ సినిమాలన్నీ మంచి విజయాలు అందుకోవాలని, నాగశౌర్య నటుడిగా ఇంకా గొప్ప పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ సంతోషం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.