ఈ నెల 28న ‘గుడ్ లక్ సఖి’

మహానటి ఫేం కీర్తి సురేష్ తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేష్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం గుడ్ లక్ సఖి. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ భారీ అంచనాలను రేకెత్తించాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సమయమంలో ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించారు. జనవరి 28 న ప్రపంచ వ్యాప్తంగా గుడ్ లక్ సఖి రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. అంతేహాకాకుండా రిలీజ్ పోస్టర్ ని కూడా షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో కనిపిస్తున్నారు.