మారుతి చేతుల మీదుగా డైమండ్ రాణి సాంగ్ రిలీజ్

అజయ్‌, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం కొత్త కొత్త‌గా.ఆనంద్, తులసి, కాశీవిశ్వనాద్, కల్యాణి నటరాజన్ ప్ర‌ధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను బి జి గోవిందరాజు సమర్పిస్తుండగా ఈ సినిమాను మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి హనుమాన్ వాసంశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలోని డైమండ్ రాణి ..సాంగ్ ను శుక్ర‌వారం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతీ రిలీజ్ చేశారు. అనంత‌రం మారుతి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక ఈ పాటకు శేఖర్ చంద్ర సంగీతం దర్శకత్వంలో కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి పాడిన డైమండ్ రాణి ..సాంగ్ ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల చేసిన కొద్ది సేప‌టికే మంచి స్పంద‌న వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను ఇటీవ‌లే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి విడుద‌ల చేశారు. ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ పూర్తికాగా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుగుతున్నాయి. ఈ సినిమాను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్నట్లు సినిమా యూనిట్ చెబుతోంది.