ఎన్టీఆర్ సాంగ్ చేసిన వారికి బాలకృష్ణ అభినందనలు

ప్రస్తుతం స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ టాలెంటెడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ గ్రాండ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఆయన శుక్రవారం ఉదయం, తన తండ్రి మరియు లెజెండరీ నటుడు నందమూరి తారక రామారావు గురించిన ప్రత్యేక పాట గురించి సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు. నవరస నటనా సార్వభౌమ, రాజకీయ భీష్మ, ప్రజాభీష్ట నందమూరి తారక రామ మహాప్రస్థానాన్ని పాటగా రచించి, నిర్మించిన అశ్విన్ అట్లూరి గారికి మరియు వారి టీం కి నా అభినందనలు.
ఓ ప్రజానాయకా, తెలుగు తల్లి పాడుతుంది నీ గీతికా
“నందమూరి తారక రామామృత” గీతాన్ని అద్భుతంగా ఆదరిస్తున్న అన్నగారి అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు నా కృతఙ్ఞతలు.
జై ఎన్టీఆర్.. జయహో ఎన్టీఆర్…జోహార్ ఎన్టీఆర్” అంటూ ఆయన పేర్కొన్నారు.

‘ఎన్టీఆర్ పాట’ను రూపొందించిన టీమ్‌ని మరియు వారి ప్రయత్నాలను బాలకృష్ణ అభినందించారు. ఈ పాటపై ప్రేమ వర్షం కురిపించిన నందమూరి అభిమానులకు మరియు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘బుల్లెట్‌ బండి’ ఫేమ్‌ ఎస్‌కే బాజీ స్వరపరిచిన ఈ పాటకు అంజనా సౌమ్య, స్వరాగ్‌ స్వరాలు అందించారు. విడుదలైనప్పటి నుండి మంచి రెస్పాన్స్‌ని పొందుతున్న ఈ పాటకు అశ్విన్ అట్లూరి సాహిత్యం కూడా అందించారు.