తెలుగు సినీ ప్రేక్షకులకు అద్భుతమైన ఫీస్ట్ లాగా శుక్రవారం నాడు రెండు భారీ సినిమాలు ఓటీటీలో విడుదల కాగా అలాగే ఒక ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ కూడా ఓటీటీ లో విడుదల అయింది.
అఖండ : నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ శుక్రవారం ఓటీటీలో విడుదల అయింది. డిస్పీ ప్లస్ హాట్ స్టార్ అనే ఓటీటీలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల అయింది. గత ఏడాది డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా ఇటీవల 50 రోజుల ఫంక్షన్ కూడా ఘనంగా సంధ్య 35 ఎంఎం లో చేసారు. సినిమా సుమారు రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల ను రాబట్టింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూశారు.
శ్యామ్ సింగరాయ్ : నేచురల్ స్టార్ నాని హీరోగా సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వచ్చిన సినిమా శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 24 విడుదల అయింది. అయితే శుక్రవారం నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయింది.
లూజర్ 2 :
ప్రియదర్శి కల్పిక గణేష్ ప్రధాన పాత్రలలో లూజర్ సిజన్ 2 వెబ్ సిరీస్ జీ5 లో శుక్రవారం విడుదల అయింది. గతంలో వచ్చిన లూజర్ సీజన్ వన్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో రెండో సిజన్ ను తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నిర్మించారు.