ఎస్ చెప్పేశా అంటున్న సుప్రిత

‘‘అవును.. ప్రతి అమ్మాయికి అలాంటి స్నేహితుడు ఒకడు ఉండాలి. ఒక అబ్బాయి.. అమ్మాయి స్నేహితులుగా ఉండలేరని అందరూ అనుకుంటారు. కానీ.. మేం స్నేహితులుగా ఉన్నాం. ఎవరేం అనుకున్నా సరే.. ఎప్పటికి మేం బెస్ట్‌ ఫ్రెండ్స్‌’’.. ఇది రెండు రోజుల క్రితం నందు అనే కుర్రాడి గురించి నటి సురేఖా వాణి కూతురు సుప్రిత చెప్పిన సమాధానం. ఇప్పుడు మరో యువకుడితో క్లోజ్‌గా ఉన్న ఫొటో పెట్టి.. ‘ఎస్ చెప్పేశా.. ’ అంటూ లవ్ సింబల్‌ని తన ఇన్‌స్టాగ్రమ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది సుప్రిత. దీంతో సోషల్ మీడియా అంతా సుప్రిత ప్రేమలో ఉందని, త్వరలోనే సురేఖా వాణికి అల్లుడు రాబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. సుప్రిత పోస్ట్ చేసిన పిక్‌లో ఉన్న యువకుడి పేరు రాకీ జోర్డాన్‌. అతను కూడా ‘సుప్రిత ఎస్ చెప్పింది’ అంటూ ఇన్‌స్టా వేదికగా తెలిపాడు. అయితే అతను నటుడు, ర్యాపర్‌ అనేది అతని ప్రొఫైల్ చూస్తుంటే తెలుస్తోంది. దీనిని బట్టి వీరిది నిజమైన ప్రేమేనా? లేక ఏదైనా వీడియో ప్రొమోషన్ కోసం ఇలా చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. త్వరలో అసలు విషయం ఏంటో తెలియనుంది.