ధనుష్ భార్యను బాగా చూసుకుంటాడు.. రజనీకాంత్ పాత వీడియో వైరల్

కోలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ ధనుష్‌-ఐశ్వర్యల విడాకుల విషయం ప్రస్తుతం తమిళనాట హాట్‌ టాపిక్‌గా మారింది. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక భార్యభర్తలుగా కలిసుండలేమంటూ ప్రకటించి అభిమానులకు షాక్‌ ఇచ్చారు. దీంతో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ కపుల్‌ విడాకులు తీసుకోవడం ఏంటని ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ధనుష్‌-ఐశ్వర్యలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. గతంలో కాలా సినిమా ఆడియో ఫంక్షన్‌లో ధనుష్‌ గురించి రజనీకాంత్‌ మాట్లాడుతూ.. ‘ధనుష్‌ చాలా మంచి వ్యక్తి. తల్లిదండ్రులను దేవుళ్లుగా భావిస్తాడు. భార్యను బాగా చూసుకుంటాడు. అతను మంచి తండ్రి, మంచి అల్లుడు, మంచి మనిషి, చాలా ప్రతిభ కలవాడు’ అంటూ రజనీ మాట్లాడిన ఓ పాత వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా కూతురి విడాకుల నేపథ్యంలో స్టే స్రాంగ్‌ తలైవా అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.