హీరోయిన్ మిత్రాశర్మ ఫొటో షూట్ వైరల్

దయానంద్ దర్శకత్వంలో శ్రీ పిక్చర్స్ బ్యానర్‌పై గీతానంద్, మిత్ర శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘బాయ్స్’. ఇటీవల సన్నీలియోన్ చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్‌ విడుదలైన విషయం తెలిసిందే. టీజర్‌కు మంచి స్పందన రావడంతో ట్రైలర్‌ను కూడా వినూత్నంగా విడుదల చేశారు మేకర్స్. ‘కామన్ మ్యాన్ ఈజ్ అవర్ సెలబ్రిటీ’ అనే కాన్సెప్ట్‌తో మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోన్న వేళ.. నిర్మాత, హీరోయిన్ మిత్ర శర్మ హాట్ ఫొటోషూట్‌తో ఓ వీడియోని, పిక్స్‌ని విడుదల చేసింది. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు నిర్మాణ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్న మిత్ర శర్మ.. ఇప్పుడిలా హాట్ హాట్ ఫొటో షూట్‌‌తో తన సినిమా గురించి అంతా మాట్లాడుకునేలా చేస్తోంది. డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆమె.. త్వరలోనే మరికొన్ని సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా, త్వరలోనే ఆమె నటించి, నిర్మించిన ‘బాయ్స్’ చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు.