ఈ ‘శ్యామ్’ ఎవరికి నచ్చాడో తెలుసా? అంటున్న నాని

ఈ ‘శ్యామ్’ ఎవరికి నచ్చాడో తెలుసా? అంటూ నేచురల్ స్టార్ నాని చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలై.. మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంపై ప్రముఖులెందరో ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి చూశారని తెలుపుతూ నాని ఓ పిక్‌ని పోస్ట్ చేశారు. ఈ పిక్‌లో చిరంజీవి, నాని మీసం తిప్పుతున్నారు. ముందు ఈ ‘శ్యామ్’ ఎవరికి నచ్చాడో కనిపెట్టండి? అంటూ ట్వీట్ చేసిన నాని.. కొద్ది సేపటికే మెగాస్టార్ చిరంజీవితో ఉన్నఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటో చూసిన నాని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ‘ఆచార్య’ మెచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నాని చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.