దుల్కర్ సల్మాన్‌కు కరోనా

చిత్ర పరిశ్రమను కరోనా మహమ్మారి వదిలేలా కనిపించడం లేదు. రోజురోజుకు స్టార్లు కరోనా బారిన పడడం ఎక్కువైపోతోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా అందరూ కరోనా బారిన పడడం భయాందోళనలకు గురిచేస్తోంది. ఇటీవల మాలీవుడ్ స్టార్ హీరో మమ్ముట్టి కరోనా బారిన పడిన విషయం విదితమే.. ప్రస్తుత్తం ఆయన ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మమ్ముట్టి కుమారుడు, హీరో దుల్కర్ సల్మాన్ కి కూడా కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. “నాకు ఇప్పుడే కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. కొద్దిగా జలుబు తప్ప నేను బాగానే ఉన్నాను. నేను ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నాను. ఇటీవల కాలంలో ఎవరైతే నాతో పాటు షూటింగ్ సెట్ లో కలిసి ఉన్నారో వారందరు ఐసోలేషన్ లో ఉండండి.. లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోండి. ఈ పాండమిక్ ఇంకా అవ్వలేదు.. అందరు జాగ్రత్తగా ఉండండి. దయచేసి అందరు మాస్క్ ధరించండి.. సేఫ్ గా ఉండండి” అంటూ దుల్కర్ ట్వీట్ చేశారు. వారం రోజుల గ్యాప్ లోనే తండ్రికొడుకులిద్దరూ కరోనా బారిన పడడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు.