యండమూరి చిత్రానికి వినాయక్ సపోర్ట్

రచయిత యండమూరి వీరేంద్రనాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అతడు-ఆమె-ప్రియుడు’. ప్రముఖ నటుడు సునీల్- బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ – సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ విభిన్న కథా చిత్రం ప్రస్తుతం ఫస్ట్ కాపీ సిద్దం చేసుకుని విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను యాక్షన్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు వి.వి. వినాయక్ విడుదల చేశారు. అనంతరం ట్రైలర్ చాలా బాగుందని.. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందనే ఆశాభావాన్ని వినాయక్ వ్యక్తం చేశారు. తమ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసి.. శుభాకాంక్షలు తెలిపిన వి.వి.వినాయక్‌కు నిర్మాతలు రవి కనగాల – రామ్ తుమ్మలపల్లి ధన్యవాదాలు తెలిపారు. రచయితగా ఎన్నో సంచలనాలకు నెలవైన యండమూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని వారు పేర్కొన్నారు.