ఆస్ట్రేలియాలో ‘అఖండ’ 50వ రోజు వేడుకలు

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా విడుదలై విజయవంతంగా 50 రోజులు పూర్తయిన సందర్బంగా ప్రపంచ దేశాలలో స్పెషల్ షోలను ప్రదర్శించారు. ఈ సందర్బంగా ఆస్ట్రేలియాలోని రాష్ట్రాలలో ఈ చిత్రం విడుదలైన అన్నిచోట్లా సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా బ్రిస్బేన్‌లో బాలయ్య అభిమానులు 50వ రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బాలయ్య అభిమానులు మాట్లాడుతూ.. ‘‘కరోనా సమయంలో విడుదలైన ‘అఖండ’ చిత్రం.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మళ్లీ ఊపిరి పోసింది. ఇండస్ట్రీకి దారి చూపెట్టడమే కాకుండా.. ధైర్యాన్నిచ్చింది. 50 రోజుల పాటు థియేటర్లలో సినిమాలు ఆడటం కనుమరుగవుతున్న తరుణంలో.. ఈ సినిమా ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శింపబడుతుండటం టాలీవుడ్‌కి మంచి శుభపరిణామం. ఇంత గొప్ప చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన యూనిట్ మొత్తానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము..’’ అని తెలిపారు.