‘గని’ నుంచి పవర్ ఆఫ్ గని స్పెషల్ గ్లింప్స్ రిలీజ్

మెగా వార‌సుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి త‌క్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించారు వ‌రుణ్ తేజ్ కొణిదెల‌. బుధ‌వారం వరుణ్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆయన తాజాగా న‌టిస్తున్న స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ చిత్రం ‘గ‌ని’ నుంచి ‘ప‌వ‌ర్ ఆఫ్ గ‌ని’ పేరిట‌ స్పెష‌ల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో వ‌రుణ్ పాత్ర‌ను ఎలివేట్ చేస్తూ చూపించారు. సీరియ‌స్ లుక్‌లో రింగులోకి దిగిన‌ వ‌రుణ్ ప్ర‌త్యర్థిని మ‌ట్టి క‌రిపించారు. ఈ వీడియో చూసిన అభిమానులు నీ క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం హిట్ రూపంలో త‌ప్ప‌కుండా ద‌క్కుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో స‌యూ మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా సిద్ధు, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్‌ హీరోయిన్‌ తమన్నా ఓ స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం స‌మ్మ‌ర్‌లో రిలీజ్ కానుంది.