హీరోయిన్ ప్రియాంక జవాల్కర్‌కు కరోనా

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులకు తెలియజేసింది. ‘‘అన్ని జాగ్రత్తలు తీసుకున్నపటికీ అన్ని లక్షణాలతో నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను ఐసోలేషన్ లో ఉన్నాను. వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతున్నాను. దయచేసి ఇటీవల కాలంలో నన్ను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి అందరు మాస్కులు ధరించండి.. అవసరమైతే తప్ప బయటికి రాకండి.. జాగ్రత్తగా ఉండండి” అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రియాంక, రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యింది. ఈ సినిమా విజయంతో అమ్మడు మంచి అవకాశాలనే అందుకుంది. ‘తిమ్మరుసు’, ‘ఎస్ ఆర్ కల్యాణమండపం’ లాంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైంది.