నాగార్జున గారు చాలా ఫ్రీడమ్ ఇస్తారు: అనూప్ రూబెన్స్‌

10

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. . అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన‌ ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో నాగార్జున‌ ఒక పాట‌ను ఆల‌పించారు. ఈ పాట‌ల‌కు సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్ బాణీలు స‌మ‌కూర్చారు. ఈ సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా జనవరి 14న రాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా చేస్తోంది. ఇందులో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ శుక్రవారం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…‘‘నాగార్జున గారితో సినిమా చేయ‌డం ప్రోత్సాహంగా వుంటుంది. ఫ్రెండ్లీ వాతావ‌ర‌ణం క‌లుగుతుంది. ఆయ‌న‌తో నేనే కాదు ఎవ‌రు చేసినా ఫ్రీడమ్ ఇస్తారు. ప్ర‌తీ టెక్నిషియ‌న్ ఫీలింగ్ ఇదే. దానితో ఇంకాస్త బాధ్య‌త‌గా వుండాల‌నుకుంటారు. నాగార్జున సార్‌తో ఇంత‌కుముందు చేసిన‌ సినిమాలు హిట్ కావ‌డం కూడా ఓ భాగం. నాదృష్టిలో ఎఫర్ట్ అనేది అన్ని సినిమాల‌కు పెడ‌తాం. ఒక్కో హీరోతో సినిమా చేయ‌డం అనేది మాతృ సంస్థ‌లా ఫీల‌య్యే వాతావ‌ర‌ణం క‌నిపించ‌డ‌మే. మన‌కు ఏం కావాలో వారికి తెలుసు. వారు ఏం కోరుకుంటున్నారో మ‌న‌కు తెలుసు. ఇదంతా కాంబినేష‌న్ వ‌ల్లే జ‌రుగుతుంది. ద‌ర్శ‌కుడు, హీరో అనే కాంబినేష‌న్‌లు ఔట్‌పుట్ క్లారిటీ ఇవ్వ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఫైన‌ల్‌గా ఏ సినిమాకైనా ప‌డే క‌ష్టం ఒక్క‌టే. ఇంత‌కుముందు చేసిన సోగ్గాడే చిన్నినాయ‌నా అనేది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. దానితో కాస్త ఒత్తిడి అనేది స‌హ‌జ‌మే. ఎందుకంటే దానితోనే కంపేర్ చేస్తుంటారు. అందుకే ఒక‌టికి ప‌దిసార్లు క్రాస్ చెక్ చేసుకుని మంచి ఔట్‌పుట్ ఇవ్వాల్సి వుంటుంది. నాగార్జున సార్ కూడా మ‌న‌కు ఓ బెంచ్ మార్క్ వుంద‌నేవారు. అలాగే ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ కృష్ణ కూడా అంతే ఎఫర్ట్  పెట్టి చేశారు. నేను మ‌నం సినిమా చేస్తుండ‌గా పియోరే.. సాంగ్‌ను ఆయ‌న లొకేష‌న్‌లో స‌ర‌దాగా పాడారు. ఆ వాయిస్ బాగా న‌చ్చింది. మీ వాయిస్ బాగుంది. ఓ పాట పాడండి అన్నా. అలా సోగ్గాడే..లో డిక్క‌డిక్క‌డుండుం.. అనే ది ట్రై చేశాం. ఆ పాట‌ను ప్రేక్ష‌కులు బాగా ఆద‌రించారు. దానికి కొన‌సాగింపుగా పాడించాల‌ని బంగార్రాజులో పాడారు. ఈ పాట పాత్ర‌ప‌రంగా సంద‌ర్భానుసారంగా ఆయ‌న పాడితేనే మ‌రింత ఎఫెక్ట్ వుంటుంది. అలా సినిమాకు క‌లిసి వ‌చ్చింది. దానితో మొత్తం సాంగ్ ఆయ‌నే పాడేశారు. నాకు న‌టించ‌డం క‌ష్టం. ఎవ‌రి ప‌ని వారు చేయాలి. కానీ కొంత‌మంది ఏదైనా ప‌ట్టుద‌ల‌తో చేసి స‌క్సెస్ సాధిస్తారు. ఇప్ప‌టికే మూడు పాట‌లు విడుద‌ల చేశాం. ల‌డ్డుందా.. జ‌నాల‌కు బాగా చేరువ‌యింది.నా కోసంఅనే మెలోడి సాంగ్‌, త‌స్సాదియ్యా.. బాగా ఆద‌ర‌ణ పొందాయి. మూడు రోజుల్లో మ‌రో సాంగ్ రాబోతుంది. ఒక‌ర‌కంగా ప్ర‌స్తుతం ట్రెండ్ ను బ‌ట్టి ఇలా చేయ‌డ‌మే బెట‌ర్‌. బంగార్రాజులో తొలిపాట‌ను మూడు నెల‌ల నాడే విడుద‌ల చేశాం. అలాగే మిగిలిన పాటలు కూడా. ఇక ఒక్కో సాంగ్‌కు ఒక్కో ప‌త్రేక‌త వుంటుంది. దాని వ‌ల్ల అంద‌రూ విన‌గ‌లుగుతున్నారు. గ‌తంలో సీడీలు పెట్టుకుని వినేవారు. కానీ సోష‌ల్ మీడియా వ‌చ్చాక ఒక్కోపాట‌ను హాయిగా విన‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. అందుకే మిలియ‌న్ల వ్యూస్ వ‌స్తున్నాయి. ఒక్కో పాట విడుద‌ల చేయ‌డంవ‌ల్ల కొంత‌మందినైనా ట‌చ్ చేస్తుంది. దాని వ‌ల్ల సినిమా చూడాల‌నిపిస్తుంది. సిద్ శ్రీరామ్ పాడిన మొద‌టి సాంగ్ 5 మిలియ‌న్ కు చేరువ‌యింది. మూడు పాట‌లు పాడించాను. ఇంత‌కుమందుమంచిరోజులు వ‌చ్చాయిలో కూడా పాడాడు. ఆయ‌న గాడ్ గిఫ్టెడ్ సింగ‌ర్‌. ఆయ‌న వాయిస్‌లో తెలీని సోల్ వుంటుంది. ఏ పాట పాడినా ఆహ్లాద‌క‌రంగా వుంటుంది. నాకు అది ప్ల‌స్ అయింది. నేను మెలోడీనే ఇష్ట‌ప‌డ‌తాను. ఆయ‌న అవే పాడ‌తారు. నేను మ్యూజిక్ చేస్తున్నశేఖ‌ర్` సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా వుంది. దానికి బ్యాక్ గ్రౌండ్   స్కోర్ చాలా కీల‌కం. బాగా వ‌చ్చింది. త‌ర్వాత  విక్ర మ్ కె. కుమార్ సినిమా వుంది.’’ అని తెలిపారు.