ప్రముఖ తమిళ దర్శకుడు మృతి

2 7

ప్రముఖ తమిళ డైరెక్టర్ ఎం త్యాగరాజన్ బుధవారం మృతి చెందారు. చెన్నైలోని ఏవీఎం స్టూడియో ఎదురుగా ఉన్న సందులో ఆయన నిర్జీవంగా కనిపించారు. ఆయనను అలా చూసిన కోలీవుడ్ ఇండస్ట్రీ వారు షాక్‌కు గురయ్యారు. 1991లో ఏవీఎం ప్రొడక్షన్ బ్యానర్‌లో వచ్చిన ‘మానగర కావల్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న త్యాగరాజన్ అనారోగ్యం, పేదరికం కారణంగా ఆ స్టూడియో పరిసరాల్లోనే చనిపోవడం గుండెలను పిండేసే విషయం. వెట్రి మెల్ వెట్రి వంటి మరెన్నో హిట్ సినిమాలను త్యాగరాజన్ తెరకెక్కించారు. ఆయన మృతిపై కోలీవుడ్ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతికి నివాళి అర్పించింది.