‘ఆర్ఆర్ఆర్’ సీత మేకింగ్ వీడియో విడుదల

8 6

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ సీత పాత్రతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్స్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్‌.. తాజాగా ఆలియాభట్‌… సీతగా మారిన మేకింగ్ వీడియోని విడుదల చేసింది. ఇందులో ఆలియా రాజమౌళితో కథా చర్చలు జరుపుతూ, సంప్రదాయ లంగా ఓణీ దుస్తుల్లో దర్శనమిచ్చింది. ఇప్పటికే సీత పాత్రకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌కు చక్కటి స్పందన వచ్చింది. ఇందులో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామ రాజు పక్కన సీతగా కనిపించింది ఆలియా. ఒలీవియా మోరిస్‌, అజయ్‌ దేవగణ్‌, శ్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.instagram.com/p/CXLvIISBeOG/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again