మెగాస్టార్ ‘భోళా శంకర్’ అప్డేట్

3 7

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో ‘భోళా శంకర్’ ఒకటి. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజా సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వచ్చింది. నవంబర్ నెలలో ఘనంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇటీవలే సెట్స్‌పైకి వచ్చింది. ఇందులో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ మెగాస్టార్‌కు చెల్లిగా కనిపించబోతుంది. తమిళ సూపర్ హిట్‌ ‘వేదాళం’కు తెలుగు రీమేక్‌గా రూపొందుతున్న ‘భోళా శంకర్’ చిత్రానికి సంబంధించి ఓ స్టైలిష్ ఫైట్ సీక్వెన్స్‌ను అలాగే, భారీ సెట్‌లో ఓ సాంగ్‌ను కంప్లీట్ చేసినట్టు చిత్రబృందం తెలిపింది. ఈ సాంగ్‌కు శేఖర్ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ అందించారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సెకండ్ షెడ్యూన్‌ను కూడా ప్రారంభించారు. ఈ చిత్రంలో బిగ్‌బాస్ సీజన్ 5 ఫేం లోబో కూడా నటిస్తున్నాడట. మెగాస్టార్‌ పక్కన ఉండి నటించడం అంటే తన కల నెరవేరినట్లేనని లోబో హర్షం వ్యక్తం చేశాడు. ఏకే ఎంటర్‌టైనెమంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటే ఆచార్య, ‘గాడ్ ఫాదర్’, బాబీ చిత్రాల షూటింగ్స్‌లోనూ మెగాస్టార్ పాల్గొంటున్నారు.