వెనక్కి తగ్గేదేలే అంటున్న భీమ్లా నాయక్!

తెలుగు సినీ పరిశ్రమ విషయానికి వస్తే సంక్రాంతి అనేది చాలా పెద్ద సీజన్. అందుకే మూడు నాలుగు పెద్ద సినిమాలు విడుదల చేయడానికి కూడా దర్శకనిర్మాతలు వెనకాడరు. ఇప్పుడంటే కరోనా పరిస్థితుల వలన ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి భయపడుతున్నారు కానీ ఒకప్పుడు సంక్రాంతికి ఎన్ని సినిమాలు విడుదలైననా అన్నింటినీ వరుసపెట్టి చూసేవాళ్ళు. దాదాపు అందరు హీరోలు దర్శక నిర్మాతలు కూడా ఈ సీజన్ లో సినిమా విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు . వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటికే నాలుగు సినిమాల సిద్ధంగా ఉన్నాయి. జనవరి ఏడో తారీఖున అందరికంటే ముందు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అవుతుండగా 12వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రాణా కాంబినేషన్ లో వస్తున్న భీమ్లానాయక్ 14వ తేదీన ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాల విడుదలకు రంగం సిద్ధమైంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ ఉన్నట్లు ప్రచారం జరగాగా ఏమీ లేదని చిత్ర నిర్మాత క్లారిటీ ఇచ్చారు. వీడియో రష్ చూశాను, రాసుకోండి, 12న బ్లాస్ట్ కు సిద్దం కండి అంటూ చెప్పుకొచ్చారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ‘భీమ్లా నాయ‌క్‌’ లో రానా ద‌గ్గుబాటి కీలక పాత్రలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సాగ‌ర్ కె.చంద్ర దర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాకు స్టార్ రైట‌ర్, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ మాట‌లు, స్క్రీన్‌ప్లే అందిస్తునారు. ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. సినిమాలో నిత్యామీన‌న్‌, సంయుక్తా మీన‌న్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.