నా పాత్ర చూసి ఊహ బయపడింది : హీరో శ్రీకాంత్

akh 1

సీనియర్ హీరో శ్రీకాంత్‌కు తెలుగు ఇండస్ట్రీలో సాఫ్ట్‌ ఇమేజ్ ఉంది. 100 సినిమాలకు పైగా నటించిన ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో కనిపించారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈయనను బాగా అభిమానిస్తారు. అలాంటి హీరో ఈ మధ్యే బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో క్రూరమైన ప్రతినాయకుడిగా కనిపించాడు. తనకు అలవాటు లేని పాత్ర అయినా కూడా అందులో పరకాయ ప్రవేశం చేశాడు. కానీ కొంత‌మంది ఫ్యాన్స్ మాత్రం శ్రీకాంత్‌ను అలా విల‌న్‌గా చూడ‌టానికి ఇష్ట‌ప‌డ‌ట్లేదు. ఈయ‌న రోల్‌పై మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో అఖండ సినిమాలో త‌న పాత్ర గురించి వ‌స్తున్న రెస్పాన్స్‌పై శ్రీకాంత్ స్పందించాడు. అఖండ సినిమాలో ఈ క్యారెక్టర్ చేయడం తనకు వ్యక్తిగతంగా చాలా నచ్చిన విషయం అంటున్నారు శ్రీకాంత్. పైగా అఖండ సినిమాలో తన గెటప్ చూసి తన భార్య ఊహ భయపడింది అంటూ చెప్పాడు శ్రీకాంత్. ఒకసారి షూటింగ్ అయిపోయిన తర్వాత అదే గెటప్‌లో ఇంటికి వెళ్లానని.. అప్పుడు ఊహతో కలిసి కొందరు మాట్లాడుతూ ఉన్నారని ఆ గెటప్‌లో తనను చూసి వాళ్లంతా కంగారుపడ్డారని గుర్తు చేసుకున్నాడు శ్రీకాంత్. అలాగే సినిమా చూసిన తర్వాత ఊహ కూడా చాలా కంగారు పడిందని.. భయపడుతూనే ఉంది అంటున్నాడు శ్రీకాంత్. ఇకపై కూడా కేవలం హీరోగా నటిస్తానని కూర్చోకుండా.. నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ విలన్ గా కూడా నటిస్తాను అంటున్నాడు.