ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ థియేటర్స్ లిస్ట్!

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్’ జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా పబ్లిసిటీ వేగాన్ని కూడా పెంచారు రాజమౌళి. యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ హీరోలుగా నటించిన ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 9వ తేదీ నుంచి థియేటర్లలో అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ట్రైలర్ వివిధ నగరాల్లోని థియేటర్లలో ప్రదరించనున్నారు.డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి ప్రాణం పెట్టి స్వరరచన చేయగా, కె.కె. సెంథిల్ విజువల్ ఫీస్టులా సినిమాటోగ్రఫీ అందించారు. ఇక ఏయే థియేటర్లలో ప్రదర్శితమ్ కానుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.