పుష్ప ను సొంతం చేసుకున్న దిల్ రాజు ?

pushpa 1

అల్లు అర్జున్ కెరీర్ లో భారీ క్రేజ్ సంపాదించుకున్న పుష్ప హ‌క్కులు కూడా దిల్ రాజు ద‌క్కించుకున్నాడ‌ని టాక్‌. ట్రేడ్ వర్గాల సమాచారం ప్ర‌కారం పుష్ప నైజాం హక్కుల‌ను దిల్ రాజు భారీ ధరకు ద‌క్కించుకున్నారు. మొదట భారీ ధర చెప్పినా మైత్రీ మూవీస్ దిగి వచ్చి ఫైనల్ గా ఓ సెటిల్డ్ అమౌంట్ కు లాక్ చేసిన‌ట్టు స‌మాచారం. అఖండ చిత్రాన్ని నైజాంలో దిల్ రాజు మంచి బిజనెస్ చేసారు. పుష్ప విషయానికి వస్తే..ప్రమోషన్స్ విషయంలో ‘పుష్ప’ తగ్గేదే లే అంటున్నాడు. విడుదల దగ్గర పడుతుండటంతో పబ్లిసిటీ కార్యక్రమాలు మరింత ఊపందుకున్నాయి. రోజూకో ఓ కొత్త లుక్‌ తో సామాజిక మాధ్యమాల్లో హంగామా చేస్తున్నారు.రీసెంట్ గా ఓ టీజర్ ని ముందస్తు ట్రైలర్‌గా విడుదల చేసారు. అందులో కొన్ని సీన్స్ ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. రామోజీ ఫిల్మ్‌సిటీలో కొన్ని రోజులుగా తెరకెక్కిస్తున్న స్పెషల్ సాంగ్ శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 17న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే అల్లు అర్జున్‌ – సుకుమార్‌ కలయికలో రెండు భాగాలుగా రూపొందుతున్న చిత్రమిది. తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ హిందీతోపాటు, దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ విడుదలవుతోంది.