ఏపీ ప్రజలకు అండగా ప్రభాస్

పాన్-ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఎప్పటికప్పుడు తన ఉదారతను చాటుకుంటూ ఉంటారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆయన గతంలో సాయం చేసిన విషయం మందందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల సంభవించిన వరదలను దృష్టిలో ఉంచుకుని ప్రభాస్ కోటి రూపాయలను ఆంధ్రప్రదేశ్ సిఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు. దీనికి సంబంధించిన చెక్కును త్వరలో సీఎం కార్యాలయానికి పంపనున్నారు. కోవిడ్ సహాయ చర్యలకు సహాయం చేయడానికి ఈ స్టార్ హీరో గతంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల విరాళం అందించారు. ప్రధానమంత్రి సహాయనిధికి మరో రూ.3 కోట్లు ఇచ్చారు. ప్రభాస్ ఇప్పుడు రాధే శ్యామ్ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది జనవరి 14 నుంచి థియేటర్లలోకి అందుబాటులోకి రానుంది.